21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం.
20వ రౌండ్ లోనూ బీజేపీ హవా…
20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం
బీజేపీ 96,581 ఓట్లు, టీఆర్ఎస్ 75,566 ఓట్లు.
20వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 21,015 ఓట్ల ఆధిక్యం.
19వ రౌండ్ లో బీజేపీ లీడ్..
19వ రౌండ్ లో బీజేపీ కి 3,047 ఓట్ల ఆధిక్యం
బీజేపీ 91,312 ఓట్లు, టీఆర్ఎస్ 71,771 ఓట్లు.
19 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 19,541 ఓట్ల ఆధిక్యం.
18వ రౌండ్ లో బీజేపీ లీడ్..
18 రౌండ్ లో బీజేపీ కి 1876 ఓట్ల ఆధిక్యం.
బీజేపీ 85,396 ఓట్లు, టీఆర్ఎస్ 68,902 ఓట్లు.
18 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 16494 ఓట్ల ఆధిక్యం.
17వ రౌండ్ లో బీజేపీ లీడ్..
17వ రౌండ్ లో బీజేపీ కి 1,423 ఓట్ల ఆధిక్యం
బీజేపీ 79,785 ఓట్లు, టీఆర్ఎస్ 65,167 ఓట్లు.
17వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 14,618 ఓట్ల ఆధిక్యం
హుజురాబాద్ : 16వ రౌండ్ లో బీజేపీ లీడ్
16వ రౌండ్ లో బీజేపీ కి 1712 ఓట్ల ఆధిక్యం
బీజేపీ 74,175 ఓట్లు, టీఆర్ఎస్ 60,920 ఓట్లు.
16 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 13,195 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్ : 15వ రౌండ్ లో బీజేపీ లీడ్
15వ రౌండ్ ముగిసేసరికి 11 వేలు దాటిన బీజేపీకి ఆధిక్యం
15వ రౌండ్ లో బీజేపీ కి 2149 ఓట్ల ఆధిక్యం.
బీజేపీ 68,586 ఓట్లు, టీఆర్ఎస్ 57,003 ఓట్లు.
15 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 11,583 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్ : 14 వ రౌండ్ లో బీజేపీ లీడ్
14 వ రౌండ్ లో 1046 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ…
బీజేపీ 63,079 ఓట్లు, టీఆర్ఎస్ 53,627 ఓట్లు.
14 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 9,452 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: 13 వ రౌండ్ల ఫలితాలు…
13 వ రౌండ్ లో 1,865 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
బీజేపీ 58,333 ఓట్లు, టీఆర్ఎస్ 49,945 ఓట్లు.
13 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 8,388 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: 12 వ రౌండ్ల ఫలితాలు…
హుజురాబాద్ : 12 వ రౌండ్ లో మళ్ళీ ఆధిక్యంలోకి బీజేపీ
12 వ రౌండ్ లో 1,217 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
బీజేపీ 53,497 ఓట్లు, టీఆర్ఎస్ 46,974 ఓట్లు.
12 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 6,523 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: 11రౌండ్ల ఫలితాలు…
11 రౌండ్ లో టీఆర్ఎస్ కి 385 ఓట్ల ఆధిక్యం.
బీజేపీ 48,588 ఓట్లు, టీఆర్ఎస్ 43,324 ఓట్లు.
11 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 5,264 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: పదిరౌండ్ల ఫలితాలు…
బీజేపీ 44,647 ఓట్లు,
టీఆర్ఎస్ 39,016 ఓట్లు.
పది రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 5,631 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: పదో రౌండ్ ఫలితాలు…
బీజేపీ 4235 ఓట్లు.
టీఆర్ఎస్ 3709 ఓట్లు.
పదో రౌండ్ లో బీజేపీకి 526 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: పదో రౌండ్ లో బీజేపీ లీడ్..
హుజురాబాద్: ఉప ఎన్నికలో పోలైన ఓట్లు 2,05,236. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లు 82,450. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1,22,786.
హుజురాబాద్: ఇప్పటి వరకు హుజురాబాద్, వీణవంక మండలాల ఓట్ల లెక్కింపు పూర్తి. ఇంకా కౌంటింగ్ జరగాల్సిన మండలాలు…జిమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్.
బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు. ఏపీలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు కదా….గేటు కూడా తాకనివ్వం. ఏ ఎన్నికలైనా… సెంటర్ ఎదైనా వైసీపీదే విజయం. మా సంక్షేమ పధకాల అమలే మా గెలుపు. సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఘనత జగన్ కే దక్కింది- ఎమ్మెల్యే రోజా
హుజురాబాద్: 9 రౌండ్ల ఫలితాలు…
బీజేపీ 40,412 ఓట్లు
టీఆర్ఎస్ 35,307 ఓట్లు
కాంగ్రెస్ 1349 ఓట్లు.
హుజురాబాద్: హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ 500 కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు కాంగ్రెస్ ను నిరుత్సాహపరిచాయి. రేపటి సమావేశంలో హుజురాబాద్ ఫలితాల పై చర్చిస్తాం- మధుయాష్కీ
హుజురాబాద్: 9 రౌండ్ల తరువాత బీజేపీకి 5,105 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: 9వ రౌండ్‌లో 1835 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
హుజురాబాద్: ఏడు రౌండ్ల తరువాత బీజేపీకి 3,432 ఆధిక్యం.
హుజురాబాద్: ఏడో రౌండ్‌లోనూ బీజేపీ లీడ్.
హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు ముందు ఊహించినట్టే వస్తున్నాయి. హుజురాబాద్‌లో గెలిచింది ఈటల…బీజేపీ కాదు- పొన్నం ప్రభాకర్
హుజురాబాద్: ఆరు రౌండ్ల ఫలితాలు…
బీజేపీ 26,983 ఓట్లు
టీఆర్ఎస్ 23,797 ఓట్లు
కాంగ్రెస్ 992 ఓట్లు
హుజురాబాద్: మొదలైన వీణవంక మండల ఓట్ల లెక్కింపు.
హుజురాబాద్: ఆరు రౌండ్ల తరువాత 3186 ఓట్ల ఆధిక్యం
హుజురాబాద్: ఆరో రౌండ్‌లోనూ బీజేపీ లీడ్.
హుజురాబాద్ 5 రౌండ్ల ఫలితాలు: బీజేపీ 22,327 ఓట్లు, టీఆర్ఎస్ 20,158 ఓట్లు, కాంగ్రెస్ 811 ఓట్లు. 5 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.
భారీ మెజారిటీతో ఈటల గెలుస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నికల మేమే గెలుస్తాం అని మొదటి నుండి చెప్పాం. హుజురాబాద్ ప్రజల తీర్పుకు శిరసు వంచి కృతజ్ఞతలు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో తెలియదు. ఈటల…కేసీఆర్ మధ్యనే పోటీ అన్నట్టు ఎన్నిక జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి గ్రామ గ్రామానికి పార్టీ విస్తరిస్తుంది- డీకే అరుణ
బద్వేల్: వైసీపీకి 1,11,710 ఓట్లు, బీజేపీ 21,621 ఓట్లు, కాంగ్రెస్ 6,205 ఓట్లు. భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుథ విజయం.
ఈటల మళ్లీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. సేవ చేసేవారినే ప్రజలు గెలిపిస్తారు- బండి సంజయ్
హుజురాబాద్: ఐదోవ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్.
హుజురాబాద్: నాలుగు రౌండ్ల ఫలితాలు…
బీజేపీ 17,969 ఓట్లు,
టీఆర్ఎస్ 16,144 ఓట్లు,
కాంగ్రెస్ 680 ఓట్లు.
బద్వేల్: వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుథ విజయం. 10 రౌండ్లు ముగిసే సరికి వైసీపీకి 85,505 ఓట్ల ఆధిక్యం. అధికారికంగా వెలువడాల్సిన మరో రౌండ్ ఫలితం.
హుజురాబాద్: నాలుగో రౌండ్‌లో బీజేపీకి 1695 ఓట్ల ఆధిక్యం. నాలుగు రౌండ్ల తరువాత 2,968 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
హుజురాబాద్: నాలుగో రౌండ్ లోనూ బీజేపీ లీడింగ్.
హుజురాబాద్: మూడు రౌండ్ల ఫలితాలు…
బీజేపీ 13,525 ఓట్లు,
టీఆర్ఎస్ 12,252 ఓట్లు,
కాంగ్రెస్ 446 ఓట్లు.
హుజురాబాద్: మూడో రౌండ్‌లో మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు. హుజురాబాద్ పట్టణంలోనూ బీజేపీకి ఆధిక్యత.
బద్వేల్: ఏడో రౌండ్ లో వైసీపీ 8,741 ఓట్ల ఆధిక్యం. ఏడు రౌండ్ల తరువాత వైసీపీకి 60,785 ఓట్ల ఆధిక్యం.
బద్వేల్: ఆరు రౌండ్ల ఫలితాలు.. వైసీపీ 52,882 ఓట్లు, బీజేపీ 10,301 ఓట్లు, కాంగ్రెస్ 2,880 ఓట్లు.
హుజురాబాద్: మూడో రౌండ్ లో 42 వ పోలింగ్ స్టేషన్ ఈవీఎం లో తలెత్తిన సమస్యలు.. పక్కన పెట్టిన అధికారులు
హుజురాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిదెల సతీష్ కుమార్ సొంత గ్రామం సింగాపురంలో బీజేపీ కి లీడ్
హుజురాబాద్: మూడు రౌండ్లు ముగిసేసరికి 1273ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
బద్వేల్ : ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం
హుజురాబాద్ : మూడో రౌండ్ లో బీజేపీకి ఆధిక్యత. మూడో రౌండ్ లో 911 ఓట్ల ఆధిక్యం
బద్వేల్ నాలుగు రౌండ్ల ఫలితాలు: వైసీపీ 41,099 ఓట్లు, బీజేపీ 8,504 ఓట్లు, కాంగ్రెస్ 2,305 ఓట్లు
హుజురాబాద్ రెండు రౌండ్ల ఫలితాలు: బీజేపీ 9461 ఓట్లు, టీఆర్ఎస్ 9,103, కాంగ్రెస్ 339 ఓట్లు.
హుజురాబాద్ రెండో రౌండ్ ఫలితాలు: బీజేపీ 4851 ఓట్లు, టీఆర్ఎస్ 4659 ఓట్లు, కాంగ్రెస్ 220 ఓట్లు.
హుజురాబాద్: రెండు రౌండ్ల తరువాత 358 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
హుజురాబాద్: రెండో రౌండ్లో బీజేపీకి 192 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్: మొదటి ఐదు రౌండ్లలో హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు. కారు గుర్తుకు దెబ్బకొట్టిన రోటిమేకర్. కారును పోలిన రోటిమేకర్ గుర్తుకు 122 ఓట్లు. కమలం గుర్తును దెబ్బకొట్టిన వజ్రం గుర్తు. వజ్రం గుర్తుకు 113 ఓట్లు.
బద్వేల్: నాలుగో రౌండ్ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ.
దాద్రా నగర్ హావేలి లోకసభ స్థానంలో శివసేన ముందంజ. మధ్యప్రదేశ్ (ఖంద్వా), హిమాచల్ ప్రదేశ్ (మండి) లోక్ సభ స్థానాల్లో ముందంజలో బిజెపి అభ్యర్థులు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు.
హుజురాబాద్: దళిత బంధు, రైతు బంధు ప్రారంభించిన శాలపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు లీడ్
హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. మొదటగా రెండు నియోజక వర్గాల్లో పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు.