బాలీవుడ్ భామల తెలుగు సినిమా రెమ్యూనరేషన్ ఎంత!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భట్ తొలిసారి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడమే వాళ్ళ ఎంపికకు కారణం. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు సదరన్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి సహజంగా ఎవరిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశగా ఆరా తీస్తే… ఆసక్తికరమైన సమాచారమే లభ్యమైంది. అలియా భట్ కు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది ఆమె డేట్స్ కోసం అప్రోచ్ అయినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. అయితే రాజమౌళి బాహుబలి చూసిన తర్వాత ఆమె మనసు మారింది. రాజమౌళి తాజా చిత్రం ట్రిపుల్ ఆర్ కోసం అలియాను అప్రోచ్ కాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమా కోసం అలియా తొలుత భారీ మొత్తాన్నే డిమాండ్ చేసిందట. అయితే పలు సంప్రదింపుల తర్వాత రోజుకు యాభై లక్షల రెమ్యూనరేషన్ కు అంగీకరించదని తెలుస్తోంది. ఆమె షూటింగ్ డేస్ మొత్తం 10 నుండి 12 రోజులు అని అంటున్నారు. ఆ రకంగా ఆమెకు ఐదు కోట్లు, ఆమె పర్శనల్ స్టాఫ్ కు షూటింగ్ జరిగినంత కాలం రోజుకు లక్ష చొప్పున ఫిక్స్ చేశారట. దీనికి ట్రావెల్ అండ్ హోటల్ మకాం ఛార్జీలు అదనం. ఆ రకంగా అలియా భట్ కోసం ఆరేడు కోట్లు ఖర్చు కట్టిపెట్టినా… ఈ సినిమా హిందీ వర్షన్ కు ఆమె ప్రెజెన్స్ ఎంతో హెల్ప్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారట. అలానే ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ కూ భారీ మొత్తమే ముట్టచెప్పారట.
ఇక ప్రభాస్ తో నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో మరో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సైతం నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం దీపిక పదుకునే సైతం భారీ మొత్తమే డిమాండ్ చేసిందట. ఆమెకు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రం ఏమంటే… గతంలోనే దీపికా పదుకునే ఓ తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన లవ్ 4 ఎవర్లో ఆమె నటించింది. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. మరి ఈ ఇద్దరు భామలకు ఇస్తున్న పారితోషికానికి తగ్గ ప్రతిఫలం నిర్మాతలకు దక్కుతుందో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!