మోహన్ బాబు ఫ్యాన్స్ ను కెలికిన సిద్ధార్థ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఇటు ప్రకాశ్ రాజ్, అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇద్దరూ రెండు ప్యానెల్స్ గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇకపోతే… తమిళ హీరో సిద్ధార్థ్ కు మొదటి నుండి ప్రకాశ్ రాజ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తెలుగు మీడియాకు సిద్ధార్థ్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకుని, ‘దిల్’ రాజుతో కలిసి వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. అనేక సినిమాల్లో ప్రకాశ్ రాజ్ తో కలిసి నటించిన సిద్ధార్థ్ కు ఆయనతో మంచి స్నేహబంధమే ఉంది. పైగా ఇద్దరి భావజాలం కూడా దాదాపు ఒకే రకంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే… ఇటీవల ఓ నెటిజన్ సిద్ధార్థ్ వయసు గురించి పరోక్షంగా కామెంట్ చేస్తూ ‘ప్రకాశ్ రాజ్ నువ్వు క్లాస్ మెట్స్ అటగా!’ అంటూ ఓ వ్యాఖ్యని పోస్ట్ చేశాడు. దానికి సిద్ధార్థ్ ‘ఛా! అతను నా దత్తపుత్రుడు. నేనూ మోహన్ బాబు గారు క్లాస్ మెట్స్. దయచేసి మీరు వాస్తవాలను తెలుసుకోండి’ అని బదులిచ్చాడు. పైకి ఇది సిద్దార్థ్ సరదాగా ఇచ్చిన జవాబేననిపించినా… నర్మగర్భంగా మోహన్ బాబుపై ఇతగాడు సెటైర్ వేశాడనే విషయం కొందరికి అర్థమైంది. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ను తాను బలపరుస్తున్నాడు కాబట్టి, తనను విమర్శించే వారంతా మోహన్ బాబు అభిమానులే అనే భావనతో సిద్ధార్థ్ ఉన్నాడని కొందరంటున్నారు. అందుకే ఇన్ డైరెక్ట్ గా మోహన్ బాబు వయసుపై సెటైర్ వేశాడన్నది వారి ఆలోచన. ఇంతకూ నటుడు సిద్దార్థ్ అసలు ఎంతో మీకు తెలుసా? 42 సంవత్సరాలు!!
Also Read
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!