Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Dakshina Directed By Osho Tulsiram As Johnny Master Hero

జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ‘దక్షిణ’

Published Date :July 1, 2021 , 8:38 pm
By ramakrishna
జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ‘దక్షిణ’
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం స్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు… జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్… డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల ‘రాధే’లో ‘సిటీమార్…’ పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం తమిళ్ టాప్ స్టార్ విజయ్ ‘బీస్ట్’ చిత్రానికి నృత్య దర్శకత్వం చేస్తున్నారు. అలాగే పలు తెలుగు, తమిళ , కన్నడ స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పుడీ కొరియోగ్రాఫర్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా తొలి సినిమా ప్రారంభించిన ఆయన, రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘మంత్ర’తో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ జోష్ తీసుకొచ్చిన దర్శకుడు ఓషో తులసీరామ్. ఆ సినిమా విజయం తర్వాత ఛార్మితో మరో ప్రామిసింగ్ సినిమా ‘మంగళ’ తీశారు. హీరోగా తన రెండో సినిమాను ఓషో తులసీరామ్ దర్శకత్వంలో జానీ మాస్టర్ చేస్తున్నారు.
జానీ మాస్టర్ కథానాయకుడిగా ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘దక్షిణ’. జులై 2 జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ “జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. నిర్మాణ సంస్థ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అలాగే, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాం” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dakshina
  • Johnny Master
  • Osho Tulasiram

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions