'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక తెలుగులోనూ బిజీ అయిపోయింది. ఆమె నటించిన 'షికారు' గత యేడాది విడుదలైంది. ఇప్పుడు మరో రెండు మూడు మహిళా ప్రధాన చిత్రాలలో సాయి ధన్సిక నటిస్తోంది. అందులో ఓషో తులసీరామ్ రూపొందిస్తున్న 'దక్షిణ' షూటింగ్ పూర్తయ్యింది.
వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం స్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు… జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్… డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు…