ఎదురులేని ప్రజానాయకుడు, తిరుగులేని కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. “ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి 99వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక ఎన్టీఆర్ తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కరోనా కారణంగా అభిమానుల క్షేమం దృష్ట్యా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లట్లేదని నందమూరి రామకృష్ణ ప్రకటించారు. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.
https://www.instagram.com/p/CPZuoCtDfq_/?utm_medium=share_sheet