ప్రస్తుతం అంతర్జాతీయంగా మ్యూజిక్ లవ్వర్స్ ని, డ్యాన్స్ లవ్వర్స్ ని ఏక కాలంలో అలరిస్తోన్న బ్రాండ్ నేమ్… బీటీఎస్! సౌత్ కొరియన్ పాప్ మ్యూజికల్ బ్యాండ్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ‘బట్టర్’ సాంగ్ తో బీటీఎస్ బాయ్స్ మరోసారి దుమ్మురేపారు. బిల్ బోర్డ్ బద్ధలు కొట్టి సత్తా చాటారు. ఇక ఇప్పుడు ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ అంటూ మరో కొత్త సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాదు, ఆల్రెడీ యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న పాప్ మ్యూజికల్ నంబర్ పై వరల్డ్ వైడ్ కాంపిటీషన్ కి తెర తీశారు…
యూట్యూబ్ తో బీటీఎస్ సింగర్స్ చేతులు కలిపి ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ షార్ట్స్ కోసం ఆహ్వానం పలికారు. ప్రపంచంలోని ఎవరైనా 15 సెకన్ల పాటూ ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ పాటపై స్టెప్పులు వేయవచ్చు. ‘పర్మిషన్ టూ డ్యాన్స్, షార్ట్స్’ అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేసి అప్ లోడ్ చేయాలి. అయితే, ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ పాటలో బీటీఎస్ సింగర్స్ ‘ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్’ ఉపయోగించారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అధికారిక సంజ్ఞల ద్వారా ‘జాయ్, డ్యాన్స్, పీస్’ అనే పదాల్ని తమ పాటలో సంకేతాల ద్వారా ప్రపంచానికి ప్రదర్శించారు. వారిచ్చిన ‘జాయ్, డ్యాన్స్, పీస్’ అనే మెసేజ్ నే కంటెస్టెంట్స్ తమ షార్ట్స్ లో ప్రదర్శించాల్సి ఉంటుంది…
ప్రపంచంలోని ఎవ్వరైనా తమ మొబైల్ కెమెరాలో యూట్యూబ్ యాప్ ద్వారా షార్ట్స్ క్రియేట్ చేసి ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ పోటీలో పాల్గొనవచ్చు. స్వేచ్ఛగా నర్తించటానికి ఎవ్వరి అనుమతీ అక్కర్లేదనేదే బీటీఎస్ అండ్ యూట్యూబ్ ఉద్దేశం. దాన్ని పాప్యులర్ చేయటానికి ఈ లెటెస్ట్ ఆన్ లైన్ కాంపిటీషన్! నెటిజన్స్ అప్ లోడ్ చేసిన షార్ట్స్ లో బీటీఎస్, యూట్యూబ్ టీమ్ కి నచ్చిన డ్యాన్స్ మూవ్స్ ప్రత్యేక కాంపిలీషన్ వీడియోలో ప్రపంచం ముందు ఉంచుతారు! మరి లేటెందుకు, ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ కు మీరు స్టెప్పులేయాలనుకుంటే ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసినట్టే!