కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు ఇంకా దేశమంతటా పూర్తిగా తెరుచుకోకపోవటంతో డిస్నీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9న అమెరికా, బ్రిటన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ కి దూరంగా ఉండనుంది. నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలిపేలా ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా డిస్నీ ఇండియా సంస్థ చేసింది. అయితే, హాట్ స్టార్ లో ‘బ్లాక్ విడో’ ఇండియన్ వర్షన్స్ ఎప్పుడు వస్తాయో తేదీ ప్రకటించలేదు. ఆగస్ట్ సెకండ్ హాఫ్ లో స్ట్రీమింగ్ అవుతుందట.
Read Also: సాయి సుశాంత్ హీరోగా స్పోర్ట్స్ ఫిల్మ్
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ‘బ్లాక్ విడో’ కూడా భాగం. సూపర్ హీరోల సినిమాలు చూసే వారికి ఈ సినిమా విషయంలో సూపర్ ఎగ్జైట్మెంట్ ఉంది. అయితే, స్కార్లెట్ జోహాన్సన్ ‘బ్లాక్ విడో’గా నటించిన సూపర్ హీరో మూవీ ఇండియన్ బాక్సాఫీస్ పరిస్థితి కారణంగా డిజిటల్ రిలీజ్ కు సై అంటోంది. కాకపోతే, చాలా మంది ‘బ్లాక్ విడో’ లాంటి హాలీవుడ్ ఎంటర్టైనర్స్ పెద్ద తెర మీదకు వస్తే జనం టికెట్ కౌంటర్స్ వద్ద క్యూ కడతారని ఇండియాలో భావించారు. కానీ, ఇప్పుడు ‘బ్లాక్ విడో’ డైరెక్ట్ రిలీజ్ అవుతుండటంతో ఇతర హాలీవుడ్ అప్ కమింగ్ సినిమాలు కూడా అదే దారిన వెళ్లవచ్చు. పూర్తిగా ఇండియన్ స్క్రిన్స్ ఓపెన్ అయ్యేదాకా ఇక్కడి హాలీవుడ్ మూవీ లవ్వర్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైనే ఆధారపడాలి! చూడాలి మరి, మన బిగ్ స్క్రీన్ బాక్సాఫీస్ బిజినెస్ కరోనా దెబ్బ నుంచీ ఎప్పటికి కోలుకుంటుందో!