సాయి సుశాంత్‌ హీరోగా స్పోర్ట్స్‌ ఫిల్మ్

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఇప్పుడు తరుణ్‌ భాస్కర్ నటుడుగానూ మారారు. అయితే అతని సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్‌ రూపొందుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘బొంభాట్’ చిత్రాలలో నటించిన సాయి సుశాంత్‌ రెడ్డి ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భైరవ్‌ పాత్రలో కనిపించ‌నున్నారు సాయి సుశాంత్‌. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రమోద్‌ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్‌ తంజావూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ లో నిర్మితమైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ త్వరలో విడుదల కాబోతుండగా, ‘సబాస్టియన్ పి.సి. 524’ సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరో కాగా, ఈ మూడో చిత్రంలో సాయి సుశాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఫీలర్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-