NTV Telugu Site icon

అఖండ మూవీపై పూర్ణ ఏమందంటే..

మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకొన్న గ్లామర్ హీరోయిన్ పూర్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండలో, అలాగే విభిన్నమైన కథతో వస్తున్న బ్యాక్ డోర్ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అఖండ చిత్రంలో మంచి పాత్ర పోషించింది పూర్ణ.

బాలయ్య మూవీలో నటించే అవకాశం రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.బాలయ్యతో కలిసి నటించాలన్న నా కోరిక నెరవేరింది. జై బాలయ్య అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అఖండ మూవీ ఫంక్షన్ లోనూ ఆమె బాగా ఎక్సయిట్ అయ్యారు. అందరికీ నా ధన్యవాదాలు అంటూ సినిమా థియేటర్లలో అంతా చూడాలన్నారు.