మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది గుడ్ న్యూస్. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య(Acharya). ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులు కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దీంతో అటు రాంచరణ్ అభిమానులు కూడా పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. పంచ్ డైలాగులతో పవర్ ఫుల్ కిక్కులతో ట్రైలర్ లో విరుచుకుపడిన చిరు.. చూసి ఫిదా అవుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. మెగా మార్కుని వారికి రుచి చూపించాయి. తాజాగా ఈ సినిమానుంచి మరో పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మణిశర్మ సంగీత సారథ్యంలో రానున్న ఆచార్య మూడో సాంగ్ భలే భలే బంజారా ఆటను ఏపిల్ 18న విడుదల చేయనున్నారు.
రీసెంట్ గా ఈ పాట కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్జ్. ఈ వీడియోలో చరణ్ , చిరు ఈ పాట కోసం ఛాలెంజ్ చేసుకోవడం చూపించారు. తాజాగా ఈ పాట ప్రోమోను విడుదలయింది. ఈ ప్రోమోలో మెగాస్టార్ మెగా పవర్ స్టార్ గ్రెస్ ఫుల్ స్టెప్ ను చూపించారు. ఈ పాట థియేటర్ లో దద్దరిల్లడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఏప్రిల్ 29న ఆసినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సాంగ్ కోసం మరికొద్ది గంటలు వెయిటింగ్ తప్పదు మరి.