‘మనసా నమః’ దర్శకుడితో శర్వానంద్ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ద్విభాషా చిత్రంలో శర్వానంద్ రీతూవర్మతో కలిసి నటిస్తున్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’లోనూ చేస్తున్నాడు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ రెండూ కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేయడానికీ శర్వానంద్ కమిట్ అయ్యాడు.
వీటి కథ ఇలా ఉంటే… తాజాగా శర్వా ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్ ‘మనసా నమః’తో దర్శకుడు దీపక్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. పలువురు యంగ్ హీరోస్ అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ కు దీపక్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చిందని, దాన్ని శర్వానంద్ హీరోగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. శర్వానంద్ సైతం కథ విని తన అంగీకారాన్ని తెలిపాడట. ప్రస్తుతం ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే ఇది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుండి ఇప్పటికే కొరటాల శివ, సుజిత్, రాధాకృష్ణ వంటి దర్శకులుగా పరిచయం అయ్యారు. ఆ జాబితాలో త్వరలో దీపిక్ రెడ్డి పేరు సైతం చేరబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!