మళ్ళీ పెంచేసిన కృతీశెట్టి!

పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల కాకముందే ఒకటి రెండు సినిమాలు కమిట్ కావడంతో మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట. కానీ ఒక్కసారి ‘ఉప్పెన’ విడుదలైన తర్వాత మాత్రం యాభై లక్షల రెమ్యూనరేషన్ కు ఫిక్స్ అయ్యిందట. అమ్మడికి ఇవాళ యూత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇవ్వడానికి కూడా కొందరు నిర్మాతలు వెనకాడటం లేదని తెలిసింది.

Read Also: రివ్యూ: నారప్ప

సో… నిన్నటి వరకూ యాభై లక్షలు పలికిన కృతీశెట్టి పారితోషికం… తాజాగా ‘బంగర్రాజు’ సినిమా నుండి 75 లక్షలకు చేరిందన్నది ఫిల్మ్ నగర్ టాక్. నిజం చెప్పాలంటే… మన నటీనటుల పారితోషికాన్ని నిర్మాతలే తెగ పెంచేస్తుంటారు. ఎలాగైనా వాళ్ళ డేట్స్ ను పొందాలనే తాపత్రయంతో లక్షలు లక్షలు గుమ్మరించేస్తారు. దాంతో చెట్టెక్కి కూర్చునే ఈ స్టార్స్ ఆ తర్వాత అక్కడ నుండి దిగి రావడానికి బాధపడతారు. ఏదేమైనా… నాగార్జున ‘బంగార్రాజు’గా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అతని కొడుకు పాత్ర చేయబోతున్న నాగ చైతన్య కు పెయిర్ గా కృతీశెట్టిని ఫైనలైజ్ చేస్తూ, ఆమెకు కింగ్ నాగ్ 75 లక్షల పారితోషికాన్ని ఇవ్వడానికి అంగీకరించాని తెలుస్తోంది. సో… మరో రెండు హిట్స్ పడితే… అమ్మడు కోటి రూపాయలు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-