భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం చర్చ్ రాం పెడ్ గ్రామంలో రైతు గోస మహా ధర్నా లో పాల్గొన్నారు వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పేదలకు ఇంకా 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చే వారన్నారు. వైఎస్సార్ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. కుర్చీలేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడంటూ రైతు గోస సభలో షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ తీరు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నలా వుందన్నారు.
Read Also: KTR: బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్
బ్రతుకు దెరువు గా ఉన్న భూమినిలాక్కునే హక్కు కేసీఆర్ కి ఎక్కడిదన్నారు. మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టిన ఘనుడు కేసీఆర్. కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు..బండ అని మండిపడ్డారు. ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. కేసీఆర్ వైఖరి తాలిబన్లను తలపిస్తోంది. బంగారు తెలంగాణ కాదు.. ఆఫ్ఘనిస్తాన్ లా మార్చారని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలన లో వ్యవసాయం ఒక శాపంగా మారిందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే నా ఆరాటం అని పునరుద్ఘాటించారు వైఎస్ షర్మిల.