అందరికీ బీఆర్ అంబేద్కర్ 131 జయంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ప్రపంచంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైద్రాబాద్ లో పెట్టబోతున్నామన్నారు. భారత దేశంలో ఎవరూ చేయని విధంగా దళితుల కోసం లో టీ- ప్రైడ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం.
రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది అప్పటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ముందు చూపునకు నిదర్శనం. 3400 గిరిజన తాండాలు గ్రామ పంచాయితీలు అయ్యాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరిదీ. వ్యవస్థలను అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది ఎవరో ప్రజలు గమనించాలన్నారు. పని చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలి. అంబేద్కర్ జయంతి అంటే కేవలం కొంత మందికే పరిమితం కాదు. 10 లక్షలు దళిత బంధు ద్వారా దళితులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటే అన్నారు మంత్రి కేటీఆర్.
Read Also:Bhatti Vikramarka: సంజయ్ ఎందుకీ పాదయాత్ర?
అంబేద్కర్ చూపించిన దారిలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వెళుతుంది. 17 వేల 750 కోట్ల రూపాయలు దళితులకు దళిత బంధు ద్వారా అందిస్తున్నాం. రెండున్నర కోట్లతో అంబేద్కర్ భవనాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేశాం. దళిత బంధు విజయ వంతం అయితే భారత దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుంది. ఉన్నవి రెండు కులాలు ఒక పేద వాడు రెండవ వాడు ధనికుడు మాత్రమే. ఏ దేవుడు చెప్పడు , దేవుడి పేరు మీద గొడవలు పొట్టుకోమనీ. శ్రీరామ నవమి రోజున కొన్ని రాష్ట్రాల్లో గొడవలు జరిగాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యవస్థలను అడ్డుపెట్టు కొని మోడీ రాజకీయ ప్రత్యర్థులపై వేటకుక్కల మాదిరిగా ఉసి గొల్పుతున్నారని విమర్శించారు కేటీఆర్.