Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర పరమ శుంఠ అని మీనాన్నే చెప్పారు నేను చెప్తే తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y. S. Sharmila: ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి షర్మిల ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో.. తనపై నమోదైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైఎస్ షర్మిల స్పందించారు. నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు నేను నీ అవినీతిని ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ.. అని మీ నాన్నే చెప్పారు కదా! మరి నేను చెబుతే తప్పా? అంటూ ప్రశ్నించారు షర్మిల. ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారు అని షర్మిల చెప్పారు. నేను అదే చెప్పాను దానికి నువ్వు నామీద కేసు వేసావు.. మరి మీ తండ్రి పై కూడా కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.
Read also: Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRTP అద్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై దళిత, టీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరుపెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్ షర్మిలపై SC, ST, చట్టం కింద కేసు నమోదచేయాలని దళిత నాయకులు పోలీసులకు కోరారు.
జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు, “కంత్రి” కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎక్కడ చూసినా కబ్జాలే ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు… ఒక దళితుడు అయి ఉండి చెరువులు.. అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. పండిత పుత్ర పరమ శుంఠ, నా కొడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. కాగా, ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు షర్మిల. అయితే తాను చేసిన విమర్శలు.. ఆరోపణలపైనే టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
NRI Welcomes KCR Plans: లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్.. మద్దతుగా యూకే ఎన్నారైలు
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!