Site icon NTV Telugu

Telangana: వైఎస్‌ షర్మిల ఫైర్‌.. కేసీఆర్‌కు సీఎం పదవి అవసరమా..?

Ys Sharmila

Ys Sharmila

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు అంటూ ఫైర్‌ అయ్యారు.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అని ఆరోపించిన ఆమె.. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, రైతు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ధర్నాలతో డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.

Read Also: AAP: ఆమ్‌ఆద్మీలో కొత్త జోష్‌.. ఆ పార్టీ గూటికి కీలక నేత..

ఏ ప్రభుత్వంలో నైనా నేను చెప్పిన పంట వేయాలి అనే హక్కు పాలకులకు ఎక్కడైనా ఉందా…? అంటూ నిలదీశారు వైఎస్‌ షర్మిల… మద్దతు ధర ఉన్న పంట పండించకపోతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ పని చేసి బతకాలి..? అని ప్రశ్నించిన ఆమె.. పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల్ని హింసిస్తున్న కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అవసరమా…? అంటూ మండిపడ్డారు. ఆనాడు కులమత బేధాలు పార్టీల కతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్న ఆమె.. ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు పోడు భూములకు గిరిజనులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని గుర్తుచేశారు.. ఇప్పుడు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా గిరిజన మహిళలు, చంటిపిల్ల తల్లులపై కేసులు బనాయించి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని.. రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చా నన్ను ఆశీర్వదించండి మళ్లీ రైతు రాజ్యాన్ని తీసుకవస్తానని ప్రకటించారు వైఎస్‌ షర్మిల.

Exit mobile version