YS Sharmila : ఇక్కడ నియంత పాలన జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం మంత్రి అజయ్ పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ఇదే ఖమ్మం పట్టణం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వేధింపులు తట్టుకోలేక .. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడ నియంత పాలన జరుగుతుందని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడని.. మంత్రి అయ్యాక… ఆ పదవికి విలువ లేదు.. హోదా తెలియదు.. హుందా కూడా తెలియదంటూ ఆమె విమర్శలు గుప్పించారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదు అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు.. ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేస్తాడు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడ కు సరిపోతుందంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు ఇల్లు లేని పువ్వాడకు హైదరాబాద్ శామీర్ పేట లో 80 ఎకరాల భూమి ఎలా వచ్చిందని, ఖమ్మంలో ఏ కాంట్రాక్ట్ చేసినా ఇతనే చేయాలని, ఆయన భార్య కంపెనీ.. లేదా బినామీ కంపెనీలే చేయాలంటూ ఆమె ధ్వజమెత్తారు. రోడ్లు,కెనాల్,బస్టాండ్ లు,అన్ని ఈయనే చేయాలని, 100 రూపాయల దగ్గర నుంచి 100 కోట్ల వరకు ఏ కాంట్రాక్ట్ అయినా పువ్వాడ నే చేయాలంటూ ఆమె విరుచుకుపడ్డారు. పువ్వాడ ఖమ్మంకి చేసింది ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. ఖమ్మంలో వాన పడితే రోడ్లు వరదలు అవుతున్నాయని, ఈయన ట్రాన్స్ పోర్ట్ మంత్రి ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందంటూ ఆమె చురకలు అంటించారు.
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
ఆర్టీసీ కార్మికుల బ్రతుకులను రోడ్ల పాలు చేశారని ఆమె దుయ్యబట్టారు. కనీసం యూనియన్స్ లేకుండా చేశారని, పువ్వాడ ఒక నికృష్టుడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ ఒక దిక్కుమాలిన మంత్రి… ఒక కంత్రి.. ఈ దిక్కుమాలిన మంత్రి వైఎస్సార్ విగ్రహాలను తీసేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. పువ్వాడ ను హెచ్చరిస్తున్నం.. పోలీస్ లను పనొల్లులా…కుక్కల్లా వాడుకోవడం మొగతనం కాదు.. ఒక రౌడీ షీటర్ గా వ్యవహరించడం గొప్ప తనం కాదు.. దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవి తో మేలు చెయ్యి.. మీకు దమ్ము లేదు..పని తనం లేదు.. పువ్వాడ అజయ్ కున్న పేరు…గుండా…రౌడీ షీటర్… దొంగ..ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!