టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఎంటి? అని కేటీఆర్ అంటున్నారు.. నాకు మా అన్న మీద కోపం ఉంటే ఇక్కడ లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది.. ఆ మాటలో నిజం లేదు కాబట్టే… అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టానని సమాధానం ఇచ్చారు. ఇక, బీజేపీతో మాకు పొత్తు ఉండదని కేటీఆర్ చెబుతున్నారు.. మరి, బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు కాదా..? మీరు తెరవెనుక పొత్తు పెట్టుకొని మమ్మల్ని అంటారా? అని మండిపడ్డారు. మాకు ఎవరితో పొత్తులు లేవు.. మేం ఎవరికి ఏజెంట్లము కామని.. టీఆర్ఎస్ ఓట్లను చీలుస్తాం, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లను సైతం చీలుస్తామన్నారు వైఎస్ షర్మిల.
Read Also: Telangana: టీచర్ల ప్రమోషన్లకు తొలగిన మరో అడ్డంకి..!
కాగా, ఈ మధ్యే ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. వివిధ అంశాలపై స్పందించారు.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల గురించి మట్లాడుతూ.. అసలు షర్మిల ఎవరు? ఆమెకు ఇక్కడేం పని? అని నిలదీశారు.. అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్టు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని ఎద్దేవా చేసిన ఆయన.. అన్న (వైఎస్ జగన్) మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టుకోవాలి.. కానీ, తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఏంలాభం? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
