Minister Harish rao angry over congress and bjp: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ఎక్కడో ఢిల్లీలోనో, హైదరాబాద్ గాంధీభవన్ లోనో కూర్చుని మాటలు మాట్లాడుతున్న నేతలకు తెలంగాణలో నీళ్లు అందుతున్నాయా? లేదా ? అనే విషయం వాళ్లకేం తెలుసని ప్రశ్నించారు. ‘బీజేపీ అంటే కాపీ పేస్ట్ పార్టీ.. తెలంగాణ పథకాలను కాపీ కొట్టి నేర్చుకుంటున్నారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బీజేపీ అని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 50 మంది యువకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లో మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also:Harish Rao: బీజేపీ అంటే “కాపీ పేస్ట్” పార్టీ
రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులు మారినా ప్రజల కనీస అవసరాలు, తాగునీరు అందించలేకపోతున్నారని కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మూడున్నరేళ్లలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందించారు. అదే కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ కో జల్”గా కాపీ కొట్టింది. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేస్తే. అదే మిషన్ కాకతీయ తరహాలో అమృత్ సరోవర్ పేరుతో కేంద్రం కాపీ కొట్టిందని.. మూగజీవాల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 120 అంబులెన్స్ లు పెట్టి మూగజీవాల బతుకులను కాపాడిన జంతు పెంపకం పథకమన్నారు. డయల్ 1962 ఎమర్జెన్సీని కేంద్రం కాపీ కొట్టి నేడు దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. పెట్టుబడి సాయం కింద రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5 వేలు ఇస్తే.. కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద కాపీ కొట్టి అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన బాగుందంటూ తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Ghulam Nabi Azad: పార్టీ పేరు, జెండాను ప్రకటించిన గులాం నబీ ఆజాద్.. పేరేంటో తెలుసా?