Kamareddy: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: తనను ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బంధువులతో కలిసి బైఠాయించింది. తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగిన ఘటన కామారెడ్డి బీబీపేట్ మండలంలో కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే..
Also Read
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్… అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. నాలుగేళ్లుగా వీరి ప్రేమ కొనసాగడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ప్రియుడి ఇంటికి వెళ్లి విషయాన్ని ప్రియుడి కుటుంబ సభ్యులకు వివరించింది. అయినా ప్రియుడి కుటుంబసభ్యులు స్పందించకపోవడంతో.. చివరకు న్యాయం కోసం పోలీస్టేషన్ మెట్లు ఎక్కింది. తను శారీరకంగా దగ్గరయ్యామని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు ప్రశాంత్‌పై అత్యాచారం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. రెండు నెలల జైలు శిక్ష తర్వాత 10 రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరగా, ‘నువ్వు కేసు పెట్టావు, నేను జైలు శిక్ష అనుభవించాను. కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.
ఈ పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకోలేను అంటూ ప్రియుడు ప్రశాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో పరార్ అయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలసి తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఆమెను ప్రేమించి శారీరకంగా వాడుకుని మోసం చేసిన ప్రశాంత్.. సచ్చినా తనతోనే, బతికినా తనతోనే బతుకుతానంటూ.. ప్రశాంత్ తో పెట్టి జరిపించాలని వేడుకుంది. సుమారు గంటపాటు ప్రియుడు ఇంటి ముందు బైఠాయించడంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి ఆందోళన విరమించారు. అయితే ప్రియుడు ప్రశాంత్ తోపాటు కుటుంబ సభ్యులు ఎక్కడికి పోయారు అనేది ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Prabhas Maruthi Movie Update : గెట్ రెడీ అబ్బాయిలూ.. డార్లింగ్ గా మారనున్న డైనోసర్
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!