Telangana: యువతి ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన 17 ఏళ్ల యువతి హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఉగాది పండగ సందర్భంగా ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. వాటిని చూసిన యువతి తల్లిదండ్రులు ఆ ఫొటోలను స్టేటస్ నుంచి తొలగించాలని యువకుడిని కోరారు.
అయితే యువకుడు మాత్రం సదరు ఫోటోలను తొలగించడానికి నిరాకరించాడు. దీంతో యువతి మనస్తాపానికి గురైంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఈ విషయం గమనించిన యువతి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్‌లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..