NTV Telugu Site icon

DAV school incident: డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనలో కోర్టు సంచలన తీర్పు.. 20 ఏళ్ల జైలు శిక్ష

Dav School Incident

Dav School Incident

DAV school incident: హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో గతేడాది ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై డ్రైవర్‌ లైంగికదాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఏవీ స్కూల్ ఘటనలో దోషికి కోర్టు శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో రజనీ కుమార్‌కు నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 17న జరగగా, నిందితుడు రజినీ కుమార్‌ను పోలీసులు 19వ తేదీన అరెస్టు చేశారు. ప్రిన్సిపాల్ వద్ద రజనీకుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే, ఆరు నెలల విచారణ మరియు విచారణ తర్వాత, కోర్టు దోషికి శిక్ష విధించింది.

Read also: Doctors operated: ఆపరేషన్ చేశాడు కడుపులో క్లాత్ మరిచాడు.. 16 నెలల తర్వాత చూస్తే..

బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న బాలిక(4)పై ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ రజినీకుమార్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండు నెలలుగా బాలికపై డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండు నెలల నుంచి బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ప్రశ్నించారు. అయితే చిన్నారి సమాధానం చెప్పలేక పోతున్నదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో చిన్నారి తీవ్ర మనస్తాపానికి గురై కేకలు వేయడంతో అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లోకి వచ్చి పిల్లలను ఇబ్బంది పెట్టాడని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగ్రహంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌ను కొట్టారు. ఆ తర్వాత అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి రజనీకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. పాఠశాల కూడా మూతపడింది. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు అనుమతి ఇచ్చింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.
Harish Rao: అప్పుడు మాటిచ్చాం.. ఇప్పుడు నెరవేర్చాం..