Yadadri Yagam: శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేశారు.
ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహణ వుంటుందని అంటున్నారు. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగానే మార్చి 28న ప్రారంభం కానుంది. మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తారు. ప్రస్తుతం నారసింహుడు కొలువై ఉన్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన జరుగుతుంది. చుట్టూ పచ్చదనం, కళా నైపుణ్యం, ఆధ్యాత్మిక వైభవంతో అపర వైకుంఠాన్ని తలపించేలా యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభం ఎప్పుడెప్పుడా అని భక్తకోటి వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది.
Also Read
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిజీ సూచనలతో.. మార్చి 28న యాదాద్రి పునర్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రిలో 10వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్తపతులు కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చూసిన ప్రముఖులు కేసీఆర్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తాజావార్తలు
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!