Jagtial Crime: గంగారెడ్డి మర్డర్ కేసు.. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు..
- సంచలనం సృష్టించిన గంగారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు లొంగుబాటు..
- ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన నిందితుడు సంతోష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Crime: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఇవాళ పోలీసులకు లొంగిపోయాడు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు సంతోష్ అక్కడ అధికారులకు తానే గంగారెడ్డి హత్య చేసినట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం గంగారెడ్డిని కారుతో ఢీ కొట్టడమే కాకుండా.. సుమారు 18 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు సంతోష్. హత్య అనంతరం లొంగిపోయేందుకు నేరుగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు రాగా అక్కడ జనాలు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుండి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అయితే అక్కడ కూడా అధికారులు ఎవరు లేకపోవడంతో.. చివరకు ఎస్పీ కార్యాలానికి వెళ్లి లొంగిపోయాడు నిందితుడు సంతోష్. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిందితుడు సంతోష్ ను మొదట మల్యాలా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మరో పోలీస్టేషన్ కు తరలించి రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. గంగారెడ్డిని ఎందుకు హత్య చేశాడు? రాజకీయ కారణాలా? లేక ఎవరైనా చెబితే గంగారెడ్డిని హత్య చేశాడా? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. నిందితుని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారైన విషయం తెలిసిందే..
BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటన..
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!