Beerla Ilaiah: ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజక్షన్.. వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..
- యాదాద్రి ఆలేరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ..
- వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..
- ఇంజక్షన్ బాక్స్‌లో గడువు తేదీ ముగిసిన ఇంజక్షన్స్ ఉండటంతో ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beerla Ilaiah: యాదాద్రి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే తనిఖీల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. రెగ్యులర్ ఇంజక్షన్ బాక్స్ లో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఇంజక్షన్ వుండటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజక్షన్ ను రెగ్యులర్ మెడిసిన్ బాక్స్ లో ఎందుకు ఉంచారని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజక్షన్ ఎందుకు ఉంచారని వైద్యులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ప్రాణాలు ఎలా కాపాడుతారు? అని మండిపడ్డారు.
ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులపై నమ్మకంతో రోగులు వస్తే.. ప్రాణాలు హరించే విధంగా వైద్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఆసుపత్రికి రావాలని సూచించారు. ప్రభుత్వ వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడే విధంగా వైద్యలు, సిబ్బంది వ్యవహరించాలని అన్నారు. డేట్ ముగిసిన ఇంజక్షన్, మందులు, ఏవైన సరే ఉపయోగించవద్దని హెచ్చరించారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను హెచ్చరించారు. అక్కడకు వచ్చిన రోగులను పలకరించారు. ఎలాంటి అనుమానం వచ్చిన అధికారులను సంప్రదించాలని కోరారు.
CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్‌డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..