NTV Telugu Site icon

MLA Rajagopal Reddy: కేసీఆర్ చేసిన మంచి పని ఇది..

Rajagopal Reddy

Rajagopal Reddy

MLA Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ వేల కోట్లు అప్పు చేసినా.. ఏం చేశారో కానీ.. యాదగిరి గుట్టను మాత్రం కట్టారు.. అది మంచి ఆలోచన అని పేర్కొన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి కట్టిందని తెలిపారు. ఎవరి ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఏం కట్టలేదు.. ప్రజా ధనంతో కట్టిందేనన్నారు. మీరు కట్టిన మిగిలినవి కూలీ పోయాయి.. ఇది దేవుడి గుడి కాబట్టి కూలకుండ అలాగే ఉందన్నారు. వేల కోట్లు పెట్టీ గుడి కట్టారు.. ప్రారంభానికి వాళ్ళ మంత్రులు, ఎంపీలు వందల వాహనాలతో వెళ్ళారు.. కానీ, నాకు ఆహ్వానం లేదు పంపించలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాచరిక పాలనను గుర్తు చేసిందనేది హరీష్ రావు ఒప్పుకోవాలి అన్నారు. ఇక, చినజీయర్ స్వామితో కేసీఆర్ కు భేదాభిప్రాయాలు వచ్చి ఆయన్నీ కూడా పక్కన పెట్టారు.. కాబట్టి సింపుల్ గా ప్రారంభోత్సం చేసినట్టు ప్రచారం జరిగింది అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Every Day Bathing: అయ్యబాబోయ్.. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఇన్ని నష్టాలా!

ఇక, మాజీమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. యాదాద్రి కేసీఆర్ హయంలో అభివృద్ధి అయ్యింది.. సిద్దిపేట నుంచి కేసీఆర్ సొంతంగా గాలి గోపురానికి బంగారం సమర్పించారని తెలిపారు. అయితే, యాదగిరి గుట్టలో ధర్మకర్తల బోర్డు అని రాశారు.. దాన్ని మండలిగా మార్చండి అని సూచించారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీకి కూడా బోర్డులో అవకాశం కల్పించండి అని కోరారు. అలాగే, గిరిజనులకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్నారు. ఇక, దేవాలయాల్లో ఈవో హుండీ నుంచి డబ్బులు ఇవ్వండి.. భక్తి భావంతో బాధ్యతతో పని చేస్తారు అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు.. అందరికీ ఇచ్చినట్టు.. వాళ్లకు కూడా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.