Writer Chinni Krishna: అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం.. గంగోత్రి సినిమాకి నేనే రచయితను అంటూ చిన్ని కృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పై చిన్న కృష్ణ ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్లు ముట్టలేదని అన్నారు. చంచల్ గూడ జైలు నుంచి ఇప్పుడే వచ్చామని తెలిపారు.
Read also: Allu Arjun: రేవతి కుటుంబానికి అండగా ఉంటా.. పుష్పరాజ్ హామీ
గాంగానదిలో స్నానం చేసి గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ కు మరకలు అంటించాలని చూస్తే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తన సినిమాల ద్వారా ఈ ప్రపంచానికి కొత్త నిర్వచనం ఇచ్చాడని అన్నారు. అల్లు అర్జున్‌పై ఇలాంటి ఆరోపణలు, అరెస్టులు అమానుషం, నీచం, హేయమైనవని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు అధికారులు ఈ ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు.
Allu Arjun Wife: భావోద్వేగానికి గురి అయిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి