NTV Telugu Site icon

Women Journalists: మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం.. హాజరైన మంత్రులు

Women Journalists Honor

Women Journalists Honor

Women Journalists Honor Program In Peoples Plaza: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, కేటీఆర్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ అధికారులు, వివిధ పత్రికల, టీవీ ఛానెల్స్ మహిళా జర్నలిస్టులు, యాంకర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి రచనా టెలివిజన్ సంస్థల ప్రతినిధులు రెహనా, దేవి, స్వాతి మైత్రేయా అభినందన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కొన్ని తరాల తర్వాత మహిళలకు సరైన స్థానం ఇవ్వడం మొదలైందన్నారు. కొన్ని తరాల క్రితం తెలియని విలువలు సృష్టించి, చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. మహిళల్ని గౌరవించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని.. మహిళల చేతిలో అధికారం ఉంటే, కుటుంబ పరిస్థితులు బాగుపడుతాయన్న ఉద్దేశంతో సీఎం అన్ని విషయాల్లోనూ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని చేస్తున్నారని, ఉత్పత్తిలో వారి భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటోందని కొనియాడారు.

Crime News: యువకుడి దారుణం.. తండ్రిని నరికి చంపి, సవతి తల్లిపై అత్యాచారం

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళల పనితీరుపై ముఖ్యమంత్రికి అపారమైన నమ్మకం ఉందన్నారు. మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరగడం సంతోషకరమైన పరిణామమని, మహిళలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి స్కీములు.. మహిళల ఇబ్బందులు తొలగించేందుకు తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ ద్వారా అమ్మ స్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కూడా ఉందన్నారు. ఇక సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జర్నలిజం అంటే నిబద్ధతతో కూడిన కార్యక్రమమని తెలిపారు. మహిళలు ఏ రంగంలో అయినా శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. ప్రతి రోజు మహిళా దినోత్సవం జరువుకోవాలని, మహిళా లేని పని లేదని చెప్పారు. మహిళ అవసరం లేకుండా సృష్టిలో ఏ పని ముందుకు వెళ్ళదన్నారు. మహిళా జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. కొంతమంది మీడియా వాళ్ళు చేస్తున్న కొన్ని విషయాల వల్ల ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మరుగున పడిపోతున్నాయని మండిపడ్డారు.

Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి