Wife Killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మతాలు వేరైనా, పెద్దల అంగీకారంతో.. పెళ్లి కూడా చేసుకున్నారు. వీల్ల జీవితం ఏడేళ్లపాటు సాఫీగా ఏచీకూచింతా లేకుండా అన్యోన్యంగా మెలిగారు. వీరిద్దరికి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త అనుమానించడం మొదలు పెట్టాడు. భార్యను తన ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతుండటంతో.. గొంతు నులిమి చంపేసింది.. ఈదారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దపల్లి ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన అజీంఖాన్ అదే కాలనీకి చెందిన శ్రావణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంతో వీరి పెళ్లి సులువైంది. అయితే.. పెళ్లయిన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ శ్రావణి తల్లి నర్మదా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. కానీ, వీరికి ఇద్దరు కుమారులు హమాన్, హర్మాన్. శ్రావణి కృష్ణానగర్‌లోని ఒక కార్పొరేట్ వ్యాపార సంస్థలో పనికి వెళ్తుంది. ఈనేపథ్యంలో.. శ్రావణి రోజూ ఫోన్‌లో మాట్లాడుతూ పనికి వెళ్తుండటంతో అజీంఖాన్ చూశాడు. ఫోన్‌లో అలా గంటలు గంటలు మాట్లాడటం ఏంటి.. ప్రవర్తన మార్చుకోవాలని పదేపదే చెప్పాడు.
అయినా.. ఇదే విషయమై భార్య శ్రావణి, అత్త నర్మదాతో అజీంఖాన్ గొడవకు దిగాడు.. కాలనీ మధ్యలోకి వచ్చి గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించడంతో, శ్రావణి, నర్మదా ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లారు. దీంతో.. ఇంట్లోకి వెళ్లిన తర్వాత శ్రావణి భర్త గొంతును గట్టిగా నులిమేయడంతో ఊపిరి ఆడక అతను కింద పడిపోయాడు. దీంతో.. అజీంఖాన్ స్పృహ లేకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అక్కడకు హుటాహుటిన చేరుకున్న సిబ్బంది, అంజీంఖాన్‌ను పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. ఈ.. సంఘటనా స్థలానికి చేరుకున్న గోదావరిఖని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Teacher Punish is a Student: హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. బాలిక మృతి
