Site icon NTV Telugu

Farmers Protest: తెల్ల జొన్న పంట కొనేదెప్పుడు?

White1

White1

నిన్న మొన్నటివరకూ ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తెల్ల జొన్న పంట కొనుగోలు చేయాలని కొమురం భీం చొరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రబీలో భాగంగా సాగు చేసిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా కలెక్టరేట్‌ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

అనంతరం ర్యాలీగా వెళ్లి కొమురం భీం చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలగడంతో పోలీసులు ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకో విరమింపజేయించారు. అక్కడి నుండి వచ్చిన రైతులు మళ్లీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించమని భీష్మించుకుని కూర్చోవడంతో ఆర్డీవో రాథోడ్ రమేష్ వచ్చి రైతులను సముదాయించారు. చివరకు ఆర్డీఓ, మార్క్ ఫెడ్ అధికారి శ్రీనివాస్ లు త్వరలో జొన్న పంట కొనుగోలుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.

IPL Media Rights: కళ్లు చెదిరే రేటుకి టీవీ, డిజిటల్ రైట్స్.. బీసీసీఐకి కాసుల పంట!

Exit mobile version