నిన్న మొన్నటివరకూ ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తెల్ల జొన్న పంట కొనుగోలు చేయాలని కొమురం భీం చొరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రబీలో భాగంగా సాగు చేసిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా కలెక్టరేట్ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కొమురం…