Site icon NTV Telugu

KTR Twitter: మోదీ జీ.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భ‌ర్తీ ఎక్క‌డ ?

Ktr

Ktr

దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడ్డారు. మీరు తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్‌ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది’’ అని మంత్రి కేటీఆర్‌.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ గురువారం ప్రధానికి ఘాటుగా లేఖ రాశారు. ఉద్యోగాలకు సంబంధించి తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమన్నారు.

ఈ ప్రశ్నలకు బదులివ్వండి? మోదీజీ..

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు?మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి చేపట్టిన చర్యలు ఏంటి?మీరు ఇస్తామన్న యేటా రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలెన్ని?ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంతో జరుగుతున్న ఉద్యోగాల నష్టంపై మీసమాధానం ఏమిటి? ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే ఆయా సంస్థల్లో రిజర్వేషన్‌ అమలు కాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు. దీనిపై ఆయావర్గాల యువతకు మీరేం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నించారు.

ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏమిటి?ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇక్కడి యువత కు మీరు ఏం చెబుతారు?హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 ఏళ్లుగా తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్‌పై మీ దగ్గర సమాధానం ఉందా? అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురింపించారు.

Exit mobile version