1. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.
2. నేడు హైదరాబాద్‌లో నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కార్మికుల వేతనాలపై చర్చించనున్నారు.
3. నేడు మంత్రి కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జహీరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,650లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.
5. నేడు రోదసీలోకి జీశాట్-4 ఉపగ్రహం ప్రవేశించనుంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.
6. నేడు మహారాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.