నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైఎస్ జగన్. ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరనున్న జగన్.
IPL: నేడు ముంబయి ఇండియన్స్ Vs గుజరాత్ టైటాన్స్. ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
నేడు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. హాజరుకానున్న మంత్రులు నారాయణ, పయ్యావుల, సీఆర్డీఏ కమిషనర్, అధికారులు. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనున్న సీఆర్డీఏ అథారిటీ.
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు. గంటలకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. మరో 19 జిల్లాల్లో తేలికపాటి వర్షసూచన. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం.
నేడు జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈ సెట్ పరీక్ష. రెండు విడతలుగా ఏపీ ఈ సెట్ పరీక్ష నిర్వహణ. ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెసన్. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు రెండో సెషన్. మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రం ఏర్పాటు.
తిరుపతి: నేటి నుంచి తాతయ్యగుంట గంగమ్మ జాతర. ఈ నెల 13 వరకు జరగనున్న గంగమ్మ జాతర. టీటీడీ చైర్మన్‌ను ఆహ్వానించిన ఆలయ ఈవో, అర్చకులు.
నేటితో ముగియనున్న వల్లభనేని వంశీ రిమాండ్. వంశీని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.
కర్రెగుట్టల్లో కొనసాగుతున్న కగార్ ఆపరేషన్. భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతున్న ఆపరేషన్. మావోయిస్టుల స్థావరాల్లోకి వెళ్లేందుకకు బలగాల యత్నం. కర్రెగుట్టపై మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,650 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.96,470 లుగా ఉంది.
అమరావతి: నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం. రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ.
