Jammi Chettu: విజయ దశమి రోజు జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు..? ఏమిటా కథ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా అనగానే దుర్గమ్మ పూజలు, కొత్త బట్టలు, పిండి వంటలు, చుక్క, ముక్కే కాదు.. అంతా కలిసి జమ్మికి వెళ్లగానే… వెంటనే జమ్మి చెట్టుపై చేయి వేయకుండా పెద్దలు ఆపి.. ఆ మంత్రం రాస్తారు.. ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం’ అని రాసి.. ఆ చీటిని చెట్టుపై పెట్టి.. ఆ తర్వాతే జమ్మి తెంపుతారు.. అసలు.. దసరా రోజు సమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు..? అనేదానిపై ఇప్పటికీ కొందరిని ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఇక, విషయానికి వస్తే.. హిందూ సాంప్రదాయంలో విజయదశమి పర్వదినం రోజున జమ్మిచెట్టును పూజించటం సాంప్రదాయంగా వస్తుంది. పూర్వికులు ఆచరిస్తున్న సంప్రదాయాన్ని నేటికీ ఆచరిస్తూ వస్తున్నారు.. కానీ, దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు అనేదానికి పురాణగాధలు అనేకం ఉన్నాయి.
Read Also: Astrology: అక్టోబర్ 05, బుధవారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
ఇక, రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారని చెప్తారు. పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. గ్రామాల్లో ఇప్పటికీ.. చెట్టు లేకపోతే.. వేరే ప్రాంతం నుంచి జమ్మికొమ్మను తెచ్చి పాతి.. దానిని ఆకులను తీసుకెళ్లడం కూడా కనిపిస్తుంది.. మరికొన్ని గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా జమ్మిచెట్లను నాటి సందర్భాలు లేకపోలేదు.. అయితే, అజ్ఞాతవాసానికి వెళ్లే సందర్భంలో పాండవులు వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచిపెట్టారని, అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత ఆ ఆయుధాలను, వస్త్రాలను కిందకి దించి.. శమీవృక్షంగా పిలిచే జమ్మిచెట్టును అపరాజిత దేవి రూపంగా పూజించి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారని చెబుతారు..
మరోవైపు, శ్రీ రాముడు కూడా రావణునిపై యుద్ధం చేసి విజయదశమినాడు విజయం సాధించిన శమీ వృక్షాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, శని దోషాలు పోతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. జమ్మి చెట్టు వద్ద పూజ చేసిన తర్వాత జమ్మి ఆకులను తీసుకొని ఇంటికి వెళ్తారు.. స్నేహితులు, తెలిసినవారికి జమ్మిఆకు చేతిలోపెట్టి అలాయ్ బలాయ్ చెప్పుకుంటారు.. ఇక, ఇంట్లోని వారి చేతుల్లో జమ్మి ఆకులను బంగారం అని చెప్పి అందిస్తుంటారు. పెద్దల చేతిలో జమ్మి ఆకులను ఉంచి.. వారి ఆశీస్సులు తీసుకుంటారు. అయితే, జమ్మి చెట్టును బంగారంగా చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయి. శమీ వృక్షంగా దీనిని అంతా పిలుస్తారు. ఎందుకంటే జమ్మిచెట్టును సంస్కృతంలో శమీ, శివా, మాంగల్య, లక్ష్మీ, శుభదా, పవిత్ర, సురభి అనే పేర్లతో పిలుస్తారు. జమ్మిచెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిఉంది. జమ్మి ఆకులు, బెరడు, విత్తనాలు, పువ్వులు, అతిసార, గర్భకోశ, కురుపులు, పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయని కూడా చెబుతారు.
అంతేకాదు.. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉందని చెప్తారు. త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.. విజయదశమి నాడు ప్రజలచే పూలజందుకుంటున్న మహిమాన్వతిమైన వృక్షంగా జమ్మిచెట్టును చెప్పవచ్చు. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టును నాటమని ప్రోత్సహిస్తోంది అంటే.. ఆ చెట్టుకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!