CM Revanth Reddy: కాంగ్రెస్ న్యాయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పోరాటం చేసింది.. బ్రిటిష్ వాళ్లపై కాంగ్రెస్ పోరాడింది.. దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని ఇచ్చింది.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉంది.. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంది.. మోడీ పీఎం అయ్యాక సామాజిక న్యాయంపై ఆలోచన చేయడం లేదని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం.. పాకిస్తాన్ విషయంలో ఇందిరా గాంధీ వార్ చేసి.. ఖాళీ మాతగా నిలిచారు.. మహాత్మగాంధీ త్యాగం చేసి దేశాన్ని కాపాడారు.. ఇందిరా, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను అర్పించారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, బీజేపీ, మోడీలను ఓడించడానికి మేం తక్కువ కాదు.. రానున్న ఎన్నికల్లో మోడీ, బీజేపీని ఓడిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియాను ప్రధాని చేయాలని అందరూ కోరినా.. మన్మోహన్ సింగ్ కు అవకాశం ఇచ్చారు.. రాష్ట్రపతి అవకాశం వచ్చినా ప్రణబ్ ముఖర్జీకి ఛాన్స్ ఇచ్చారు.. త్యాగాలకు మారు పేరు గాంధీ కుటుంబం.. ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు రాహుల్ గాంధీ తీసుకోలేదు.. దేశంలో ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడుతున్నారు.. 2001 నుంచి మోడీ కుర్చీ వదలడం లేదు.. 75 ఏళ్లు నిండిన వాళ్ళు కుర్చీ వీడాలని మోహన్ భగవత్ అన్నారు.. కానీ, మోడీ మాత్రం వదలడం లేదని సెటైర్లు వేశారు. ఆర్ఎస్ఎస్ మోడీని తప్పించక పోతే.. రానున్న ఎన్నికల్లో మోడీని రాహుల్ ప్రధాని కుర్చీ నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 స్థానాలకు మించి రావని విమర్శించారు. ఇక, తెలంగాణలో కులగణన చేసి.. దేశానికి రోల్ మోడల్ గా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
