NTV Telugu Site icon

Washing powder Nirma: అమిత్ షా పర్యటన.. హైదరాబాద్‌లో ‘వాషింగ్ పౌడర్ నిర్మా’భారీ ఫ్లెక్సీలు

Amith Shah

Amith Shah

Washing powder Nirma: ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్, ఢిల్లీలో శనివారం బై బై మోడీ అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో..కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అమిత్ షా నిన్న (మార్చి 11) హైదరాబాద్ వచ్చారు. అదే రోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ కూడా జరిగింది. దీంతో అమిత్ షా పర్యటనకు హైదరాబాద్ లో బీఆర్ ఎస్ నేతలు పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ తరపున కొన్ని పోస్టర్లు అంటించగా, ఓ వైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతల చిత్రాలు కనిపించాయి. విపక్ష నేత బీజేపీలో చేరితే అతనిపై ఎలాంటి విచారణ జరగదని, దానికి విరుద్ధంగా ఆయన మరక నుంచి బయటపడతారని ఈ పోస్టర్‌లో చూపించారు. హోర్డింగ్ పై వాషింగ్ పౌడర్ నిర్మా..వెల్ కమ్ టు అమిత్ షా అని రాసి ఉంది. ఆ హోర్డింగ్‌ పై బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్‌ పెట్టారు.

బీజేపీలో చేరిన వెంటనే కేసులు మాయమవుతున్నాయి. బీజేపీలో చేరితే అవినీతి మరకలు కాషాయం అవుతాయంటూ పోస్టర్లు అంటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ శనివారం విచారించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసును కవితపై మోపడానికి వ్యతిరేకంగా బీజేపీపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అసలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అదే సమయంలో అమిత్ షా హైదరాబాద్ కు పర్యటన నేపథ్యంలో వినూత్నంగా పోస్టర్లతో ఇలా నిరసనలు తెలిపారు.