Site icon NTV Telugu

Thieves in Girls Hostel: గర్ల్స్ హాస్టల్ లో దొంగలు పడ్డారు.. తరువాత ఏం జరిగిందంటే..

Warangal Univvercity

Warangal Univvercity

Thieves in Girls Hostel: తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చెడ్డీ గ్యాంగ్ సందడి చేసేది.. ఇప్పుడు బాలికల హాస్టళ్లలో చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. ఇలా జరగడం ఇది నాలుగోసారి కావడం కలకలం రేపుతోంది. భద్రత ఉన్నప్పుడల్లా బాలికల హాస్టళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయంటే తెలంగాణలో దొంగలు ఎక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

Read also: Revanth Reddy: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిదర్శనం

వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లోకి దొంగలు చొరబడ్డారు. ఇలాంటి దోపిడీలు జరగడం ఇదే మొదటిసారి కాదు. నాలుగు రోజులుగా ఇదే జరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్‌ గదిలోకి ప్రవేశించిన దుండగులు విద్యార్థుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. బాలికల హాస్టల్‌లో భద్రత లోపించింది అనడానికి ఈ ఘటనలే నిదర్శనమని విద్యార్థినులు అంటున్నారు. వరుసగా నాలుగు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం చోరీకి పాల్పడిన దుండగుడు తప్పించుకునేందుకు ప్రయత్నించి వ్యవసాయ బావిలో పడిపోయాడు. హాస్టల్‌లో మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు విద్యార్థులు తెలిపారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా దొంగ బావిలో పడ్డాడు. పోలీసులు దొంగను బావిలోంచి బయటకు తీసి అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
Keslapur Nagoba Jatara: నాగోబా జాతరకు బయలుదేరిన అర్జున్ ముండా, బండి సంజయ్..

Exit mobile version