EX CM KCR: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది.. ఏ మాయ రోగం వచ్చే.. ఏం బీమారి వచ్చే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి ఎన్నెన్ని చెప్పిరి.. ఏమేమి మాటలు మాట్లాడిండ్రు.. వరుసబెట్టి గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేరని సెటర్లు వేశారు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీకెళ్లి వచ్చారు.. స్టేజీల మీద డ్యాన్స్‌లు వేశారని గులాబీ బాస్ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
Read Also: Rakul Preet : దేవుడు నాకు చాలా అందం ఇచ్చాడు.. రకుల్ ఓవర్ చేస్తోందే..
ఇక, కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందన్నారు. కానీ, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు. మేము తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు.. నా కళ్ల ముందు.. తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే, బాధ కలుగుతుంది అని ఆవేదన చెందారు. మరో రెండున్నరేళ్లలో ఇక ఏం చేస్తారో చూస్తాన్నారు. మాట్లాడితే బీఆర్ఎస్ ను బద్నామ్ చేస్తున్నారంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
