NTV Telugu Site icon

Show cause notice to YS Sharmila: వైఎస్‌ షర్మిలకు పోలీసుల షోకాజ్‌ నోటీసులు..

Show Cause Notice

Show Cause Notice

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు వరంగల్‌ పోలీసులు.. లింగగిరి క్రాస్ రేపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి వైఎస్‌ షర్మిల సిద్ధం అయ్యారు.. రేపటి నుండి పాదయాత్రను పునఃప్రారంభించేందుకు గాను పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.. అయితే, పాదయాత్ర అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దు..? అంటూ ఆమెకు పోలీసులు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటి సారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు.. వారు సూచించిన నియమనిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత దూషణకు పాల్పడటం ద్వారా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని.. దానికి సంబంధించిన అధారాలను జతచేస్తూ.. ప్రస్తుతం పాదయాత్ర అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దో కారణాలను తెలియజేయాలని షోకాజ్ నోటీసులు అందజేశారు పోలీసులు..

Read Also: Minister Audimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్‌కి తప్పిన ప్రమాదం..

అంటే ఆదివారం నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు వైఎస్‌ షర్మిల సిద్ధం కాగా.. ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు వరంగల్‌ పోలీసులు.. దీంతో, వైఎస్‌ షర్మిల పాదయాత్రకు పోలీసుల అనుమతి.. పాదయాత్ర పునర్‌ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. కాగా, వరంగల్‌లో వైఎస్‌ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఆమెను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు వరంగల్‌ పోలీసులు.. లోటస్‌పాండ్‌లో విడిచిపెట్టి వెళ్లిపోయారు.. ఆ తర్వాత రోజు.. ఆమె ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించగా.. కారుతో సహా ఆమెను ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించి.. కోర్టుకు తీసుకెళ్లారు.. కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. మరుసటి రోజు గవర్నర్‌ తమిళిసైని, డీజీపీ మహేందర్‌రెడ్డిని కూడా కలిశారు వైఎస్‌ షర్మిల.. 4వ తేదీ నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వరంగల్‌ పోలీసుల షోకాజ్‌ నోటీసులపై వైఎస్‌ షర్మిల ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.