వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు భారీగా వచ్చారు. దీంతో.. ఇరు పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కాగా.. కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని శాంతింప చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ నేతలు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అటు.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.
Warangal: మామునూర్ ఎయిర్‌పోర్టు వద్ద హైటెన్షన్.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట
- మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
- బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట
- మామునూర్ ఎయిర్ పోర్టు క్రెడిట్ ఫైట్
- మామునూరు ఎయిర్ పోర్ట్ కు ఆమోదం రావడంతో..,
- కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు.

Mamnoor