Site icon NTV Telugu

Konda Murali: సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..

Konda Murali

Konda Murali

Konda Murali: వరంగల్ లోని పోచమ్మ మైదానం కూడలిలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మాట్లాడిన కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేశారు. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. కొండ మురళి పార్టీ మారితే పదవికి రాజీనామా చేసి మారిండు అని పేర్కొన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు. నాలాగా దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలను పరోక్షంగా విమర్శించారు కొండ మురళి.

Read Also: Abhishek Bachchan : వాళ్లకు అన్నీ ఇచ్చేసా.. ఒంటరిగా ఉంటా.. అభిషేక్ బచ్చన్ పోస్ట్..

ఇక, టీడీపీ నుంచి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబుని, ఈరోజు కేసీఆర్, కేటీఆర్లను వెన్నుపోటు పొడిచిండు.. రేవంత్ అన్న ఆయనతో జాగ్రత్తగా ఉండండి అని పరోక్షంగా కడియం శ్రీహరి పేరుని కొండ మురళి ప్రస్తావించారు. అలాగే, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే అని వదిలేస్తున్నాను.. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పులో కొండ మురళి ఉన్నంత వరకు రెండో నాయకుడు ఎవరూ ఉండరని తేల్చి చెప్పారు. ఇక, పరకాలలో 75 ఏళ్ల ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు, వచ్చే సారి మీకు వదిలేస్తారా అన్నాడు.. అయితే, పరకాల నియోజక వర్గంలో కొండ సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేయనుంది.. మా కార్యకర్తలకు ఇక నుంచి కొండ సుస్మిత పటేల్ అందుబాటులో ఉంటుంది అన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఎవరు కూడా అధైర్య పడొద్దు అని సూచించారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతదని కొందరు ప్రచారం చేస్తున్నారు.. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తన వెంట రేవంతన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వెల్లడించారు.

Exit mobile version