Students Talent: ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొందరు విద్యార్థులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కలిసి పాఠశాలలో పనిచేశారు. విషయం తెలుసుకున్న పీఈటీ ఇదేంటని మందలించగా. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా కలకలం రేపడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం బయటపడింది. విద్యార్థులదే తప్పు అని తేలింది. ఇంతలో ఆ 9 మంది విద్యార్థులు ఏమీ మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది.
Read also: YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గత శనివారం (జూలై 8) రాత్రి పాఠశాలలో కలిసి మద్యం కొని తాగారు. విద్యార్థులు మందు తాగడం గమనించిన పీఈటీ టీచర్ వారిని మందలించారు. మరోసారి ఇలా చేయకూడదని హెచ్చరించాడు. దీనిపై తల్లిదండ్రులకు లేఖ రాశారు. విద్యార్థులు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయారు. పీఈటీ టీచర్ మద్యం తాగి లేఖ రాశారని తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల మాటలు నమ్మి మరుసటి రోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త విద్యారాణి మంగళవారం తహసీల్దార్ సత్యనారాయణ స్వామికి ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మద్యం సేవించినట్లు విచారణలో తేలింది.
శనివారం రాత్రి మద్యం దుకాణంలో విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తేలింది. అయితే ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో వారిపై చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపాల్ అంకయ్య తెలిపారు. 21 ఏళ్ల లోపు విద్యార్థులకు మద్యం విక్రయిస్తున్న మల్లంపల్లి శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యాబుద్దులు చెప్పే మాస్టారుకే బురిడీ కొట్టించారంటే యూత్ రా నయనా అంటున్నారు స్థానికులు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నయో వీరికి అంటూ మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడు తప్పుచేయలేదని తేలిందని, లేకపోతే అతని జీవితం నాశనం అయ్యేదని అంటున్నారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం విద్యార్థులపై కన్నువేసి ఉంచాలని తెలిపారు. అంతేకాకుండా పిల్లలు చెప్పేటప్పుడు తల్లిదండ్రులు వారి మాటలు గమనించాలని యాజమాన్యం తెలిపారు.
YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య