NTV Telugu Site icon

Kazipet Railway Coach: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

Kazipet Railway Coach

Kazipet Railway Coach

Kazipet Railway Coach: ఉమ్మడి వరంగల్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని సెంట్రల్ రైల్వే అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు గత ఏడాది జులై 5వ తేదీన అప్‌గ్రేడ్‌చేయాలని దక్షిణమధ్య రైల్వే బోర్డు లేఖ రాసింది.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కాగా అప్‌ గ్రేడ్ చేసిన యూనిట్‌ లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధిం చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సంబంధించిన సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది.

Read also: Shamshabad: విమానాశ్రయంలో రూ.2.2 కోట్ల నిషేధిత కలుపు మొక్కల పట్టివేత..

కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు ఏళ్లతరబడి ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2023లో, వ్యాగన్ తయారీ పరిశ్రమపై ప్రకటన చేయబడింది, కానీ అది అమలులోకి రాలేదు. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌ ​​చేయాలని పలువురు చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ ధృవాలను అనుసంధానం చేయడంతోపాటు బొగ్గు రవాణాలో కీలకం కాజీపేట జంక్షన్ డివిజన్‌గా ఏర్పాటైతే దాదాపు 60,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
Astrology: నవంబర్ 29, శుక్రవారం దినఫలాలు

Show comments