Wanaparthy: బయటపడ్డ రెవెన్యూ అధికారుల మాయాజాలం
వనపర్తిలోని అమరచింత రెవెన్యూ అధికారుల మాయాజాలం బట్టబయలైంది. చనిపోయిన రైతు పొలంను అధికారులు ఇతరులకు పట్టా చేశారు. 43 ఏళ్ల క్రితం చనిపోయిన దేవుల బుచ్చన్న పేరుతో స్లాట్ బుక్ చేసి, ఆరు ఎకరాల భూమిని పట్టా చేసినట్టు తేలింది. ఇలా పట్టా మార్పిడి చేసినందుకు గాను అమరచింత తహశీల్దార్ భారీ మొత్తమో అందినట్టు బాధితుడు దేవుల వెంకటన్న ఆరోపణలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తహశీల్దార్ పట్టా మార్పిడి చేశారని.. అదేంటని ప్రశ్నిస్తే 43 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి స్లాట్ బుక్ చేసినట్టుగా చెబుతున్నారని వాపోయాడు. విరాసత్ చేయకుండా నకిలీ పత్రాలతో ఎమ్మార్వో సింధూజ మరొకరికి పట్టా మార్పిడి చేశారని వెంకటన్న పేర్కొన్నాడు.
అయితే.. ఎమ్మార్వో సింధూజ వాదన మాత్రం మరోలా ఉంది. వెంకటన్న చేస్తోన్న ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఇందులో తమ పొరపాటేమీ లేదని చేతులెత్తేసింది. 2017కు ముందే బుచ్చన్న పేరు నుంచి పట్టా మార్పిడి జరిగిందని.. స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ వెంకట్ పేరుతోనే జరిగిందని ఆమె వెల్లడించారు. పామిరెడ్డి పల్లిలో వారి దాయాదుల మధ్య పంచాయతీ నడుస్తోందన్న ఎమ్మార్వో సింధూజ.. ఈ విషయంపై పై అధికారులకు నివేదిక ఇస్తానని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!