SIR Process : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా..?నమోదుకు మళ్లీ అవకాశం ఇచ్చిన ఈసీ
- ముసాయిదా జాబితాలో పేరు లేకున్నా ఛాన్స్
- ఏడు రాష్ట్రాల ఓటర్లకు అవకాశం
- ఇంటికే దరఖాస్తు ఫారాలు
- పాత ఓటరు కార్డు నంబరుతోనే నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్లకు తీపి కబురు అందించింది. వివిధ కారణాల వల్ల ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చోటు దక్కని అర్హులైన పౌరులకు తుది జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు మరో సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన నమోదును నిరాకరించినట్లు కాదని, సరైన నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే తుది జాబితాలో పేరు చేరుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి పవన్ దివాన్ 2026 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (CEO) అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
ఎవరికి ఈ అవకాశం కల్పిస్తున్నారు?
ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం వల్ల ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభించని ఎస్సెంట్ (గైర్హాజరైనవారు), షిఫ్టెడ్ (నివాసం మారినవారు), డెడ్ (మరణించినట్లు పొరపాటుగా నమోదైనవారు), డూప్లికేట్ కేటగిరీల (ASDD) ఓటర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించేందుకు సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో ఈ ASDD ఓటర్ల జాబితాలను పేరు తొలగించడానికి గల కారణాలతో సహా మరోసారి ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ప్రజలు సులభంగా చూసుకోవడానికి రాష్ట్రాల సీఈఓ వెబ్సైట్లలో ఈ వివరాలన్నింటినీ పీడీఎఫ్ (PDF) రూపంలో అందుబాటులో ఉంచనున్నారు.
Also Read
- Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
- Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
- Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
- Telangana Govt: ప్రయాణికులకు 'దీపావళి' కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
సులభంగా దరఖాస్తు చేసుకునే డిజిటల్ వెసులుబాటు
సంబంధిత ఓటర్లకు పాక్షికంగా నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ECINET లో జనరేట్ చేసి, బూత్ స్థాయి అధికారుల (BLO) ద్వారా నేరుగా ఇళ్లకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు వాట్సాప్, ఈ-మెయిల్, SMS ద్వారా కూడా ఫారాలు పొందే అవకాశం కల్పించారు. ఓటర్లు తమ పాత EPIC నంబర్‌ను ఉపయోగించి ECI వెబ్సైట్ లేదా ECINET యాప్ ద్వారా దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి ECINET యాప్‌లో ‘Book a Call with BLO’ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
నివాసం ఆధారంగా సమర్పించాల్సిన పత్రాలు
గతంలో ఉన్న నివాసంలోనే కొనసాగుతూ ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించలేకపోయినవారు, దానికి గల కారణాలను వివరిస్తూ ‘అనుబంధం-B’ (Annexure-B) ప్రకటనను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా, రాష్ట్రంలోనే మరో నియోజకవర్గానికి లేదా కొత్త చిరునామాకు మారినవారు ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేకుండా, కొత్త చిరునామా వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం, ‘అనుబంధం-C’ (Annexure-C) ప్రకటన , చిరునామా ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ఇక సొంత ఇల్లు లేదా నిర్దిష్టమైన చిరునామా ధ్రువీకరణ పత్రాలు లేని నిరుపేదలకు BLO క్షేత్రస్థాయి ధ్రువీకరణ నివేదిక ఆధారంగా పరిశీలన పూర్తి చేస్తారు.
పాత ఓటరు కార్డు నంబరే పునరుద్ధరణ
ఈ దరఖాస్తులను పరిశీలించి, అర్హత , నివాసాన్ని ధ్రువీకరించిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ERO) తుది ఆమోదం తెలుపుతారు. ఆమోదం పొందిన ఓటర్లకు పాత EPIC నంబర్‌ను మాత్రమే తిరిగి కేటాయిస్తారు. అయితే, SIR ప్రక్రియ సమయంలో ఇప్పటికే కొత్త నమోదు కోసం ‘ఫారం-6’ సమర్పించిన వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని, ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశించింది.
తాజావార్తలు
-
SIR Process : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా..?నమోదుకు మళ్లీ అవకాశం ఇచ్చిన ఈసీ
-
Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
-
Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!