NTV Telugu Site icon

సంజయ్‌ది తెలంగాణ వంచన యాత్ర.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం..!

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌ వినయ్‌ భాస్కర్‌.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తెలంగాణ వంచన యాత్ర అంటూ కామెంట్ చేసిన వినయ్‌ భాస్కర్‌.. వరంగల్‌లో సంజయ్ పాద యాత్రకు ముందే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని.. లేదంటే ప్రజలు సంజయ్‌ని ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్న ప్రభుత్వ చీఫ్‌ విప్.. బీజేపీకి ఇక తెలంగాణలో పుట్ట గతులుండవన్నారు.