Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో చేపల చెరువు లూటీకి గురైంది. వేల సంఖ్యలో గ్రామస్తులు చెరువు దగ్గరకు వచ్చి చెరువులో చేపలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ పెద్ద చెరువులో మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా, వేల సంఖ్యలో గ్రామస్తులు చేపలు పట్టేందుకు తరలివచ్చారు. దీంతో ఆ చెరువంతా పుష్కరాన్ని తలపించింది. పెద్ద చెరువు లూటీ పోయిందని తెలువడంతో ఒక్కసారిగా ఎగబడ్డ గ్రామస్తులు… వలలతో చెరువులో దిగిన గ్రామస్తులు లూటీ చేశారు. అయితే అప్పటివరకు ప్రశాంతంగా వున్న పెద్ద చెరువు ఒక్కసారిగా వలలతో, గ్రామస్తులతో నిండిపోయింది.
Read also: Team India Coach: టీమిండియా కోచ్ పదవి.. అతడిని ఒప్పించేందుకు ఎంఎస్ ధోనీ ప్రయత్నాలు!
చేపలను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ విషయమై కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద చెరువు వద్దకు హుటా హుటిన పోలీసులు చేరుకున్నారు. అక్కడున్న వారిని చెదర గొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులను కూడా లెక్కచేయకుండా చేపల వేటలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు. అయితే పెద్ద చెరువు లూఠీ అవడం ఇది మూడో సారిగా కొందరు గ్రామస్థులు చెబుతున్నారు. మృగ శిర కార్తికి ఇక్కడ గ్రామస్థులకు ఈ చెరువుపై హక్కు వుంటుందని తెలిపారు. అందుకే ఇక్కడ గ్రామస్థులు చేపల వేట పడుతున్నారని అన్నారు. గొడవలు జరగలేదని, లూటీ చేయడానికి గ్రామస్థలకు హక్కు ఉంటుందని తెలిపారు. అయితే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం కనుగునేందుకు స్థానికులకు ఆరా తీస్తున్నారు.
Read also: Tragedy: భార్య భర్తపై పడిన భారీ వృక్షం.. ఆ తరువాత..
గతంలో కూడా మహబూబాబాద్ జిల్లాలో చెరువు దగ్గరకు వచ్చిన వేలాది గ్రామస్తులు చెరువులో ఉన్న చేపలను పట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా… అక్కడికి తరలివచ్చిన వేలాది గ్రామస్తులు చేపలను పట్టుకోవడానికి చూశారు. దీంతో మత్స్యకారులకు గ్రామస్తులకు ఘర్షన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతింప చేయాలని చూశారు. పోలీసుల మాటలను గ్రామస్థులు పట్టించుకోకుండా తోసుకుంటూ వెళ్లి చేపలను పట్టుకున్నారు. వేలాదిగా వచ్చిన గ్రామస్తులను పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు.
Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు..?
