NTV Telugu Site icon

Vikarabad: రోడ్డు బాగు చేయండి సార్.. గుంతలో ఇరుక్కున్న బస్సు..

Vikarabad

Vikarabad

Vikarabad: వికారాబాద్ లో దోమ మండల ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డు అంతా గుంతలమయంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలవు అన్నట్లు వాటికి తోడుగా రోడ్లపై గుంటలతో ప్రజలు, వాహనదారులు, ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపూర్ గ్రామ మధ్యలో ఉన్న BT రోడ్ గత 10 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామపంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ తిరిగి గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య గురించి ఎన్నో సార్లు R&B అధికారుల , స్థానిక MLA ల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని స్థానికులు అంటున్నారు. రోజు ఎంతో మంది ప్రయాణికులు పనుల నిమిత్తం వెళ్లే ఈ దారిలో ఇలాంటి గుంతల వల్ల అవస్థలు పడాల్సి వస్తుందని అంటున్నారు.

Read also: Banjara Hills: విద్యుత్‌ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..

దాదాపూర్ గ్రామంలో ఉన్న పాఠశాలకు చుట్టుప్రక్కల ఉన్న వివిధ గ్రామాల నుండి ఎంతో మంది విద్యార్థులు కాలినడకన వస్తుంటారని అన్నారు. ఈ గుంతల వల్ల విద్యార్థులు జారీ బురదలో పడిపోవడం, వాహనాలు జారీ పడిపోవడం వంటివి జరగడంతో రోజువారి పనులకు ఇబ్బందిగా మారిందన్నారు. రాత్రి సమయంలో అయితే ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ఇక్కడ కిందపడి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. నిరంతరం ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు పై గుంతలు ఏర్పడటం చాలా ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. దీనికి రుజువు ప్రయాణికులతో వెళుతున్న బస్సు బురద గుంతలో ఇరుక్కుపోవడం అన్నారు. ఆ బస్సును బయటకు తీయలేక నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో చిన్నారులు, మహిళలు ఇబ్బందులకు గురి అయ్యారని మండిపడ్డారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, R&B అధికారులు స్పందించి దాదాపూర్ రోడ్డు పై ఏర్పడిన గుంతలను సందర్శించి ఇక్కడ ప్రస్తుతానికి మరమ్మత్తులు చేసేటట్లు, మరియు ఒక్క కల్వర్టు మంజూరు కూడా చెయ్యాలని స్థానిక గ్రామప్రజలు అందరూ కోరుతున్నారు, లేనిచో త్వరలో వివిధ అధికారుల కార్యాలయాలను ముట్టడి చేస్తాం అని హెచ్చిరించారు.
Prevention Dogs: వీధి కుక్కల బెడద అరికట్టండి.. సీఎం ఆదేశాలతో రంగంలోకి జీహెచ్‌ఎంసీ..